WGL: నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ వ్యక్తి 100 కి డైల్ చేశాడు. దీంతో సమాచారం అందుకున్న వెంటనే వరంగల్లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని రక్షించారు. అతడిని సురక్షితంగా పోలీస్ స్టేషన్కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.