SRD: బొల్లారం మున్సిపల్ గాంధీనగర్ కాలనీలో శ్రీ రామ్ మందిర్ ట్రస్ట్, కొత్వాల్ లతా శ్రీ కృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైయ్యరు.