E.G: ఏలూరు బిశ్వనాధ్ భర్తీయ ఈత కొలనులో ఆదివారం జరిగిన 7వ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ -2025లో కొంతమూరుకు చెందిన దివ్యాంగుడు ఎం. సతీశ్ ప్రతిభ చూపాడు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 50 మీటర్ల స్విమ్మింగ్‌ను 46 సెకన్లలో పూర్తిచేసి గోల్డ్, కాంస్య పతకాలను గెలుచుకున్నారు.