BDK: అన్నపురెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రగుంట విద్యార్థులు, ఉపాధ్యాయులు మొత్తం 37 మంది సికింద్రాబాద్లోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయాన్ని ఇవాళ సందర్శించారు. అక్టోబర్ 15 అబ్దుల్ కలాం జన్మదినాన్ని పురస్కరించుకొని ఇన్నోవేటివ్ ఐడియా మీద ఆన్లైన్లో అప్లై చేయుటకు, రెండు ప్రాజెక్ట్స్ ఎగ్జిబిట్ చేయుటకు వారికి అవకాశం లభించిందని తెలిపారు.