ప్రకాశం: హనుమంతునిపాడులోని ఎస్సీ బాలుర వసతి గృహం అరకొర సౌకర్యాలతో నడుస్తుందని దీనికి శాశ్వత భవనాన్ని ప్రభుత్వం మంజూరు చేసి నిర్మించాలని సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వసతిగృహం ఇనుప రేకుల నివాసంలో నడుస్తుందని వసతులు కల్పించాలన్నారు.