కోనసీమ: నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 11 గంటలకు ముక్తేశ్వరం తొగరపాయ వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30కు అంబాజీపేట మండలం అంబాజీపేట బస్టాండ్ వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.