BHPL: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఇవాళ BJP జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మోరే సముద్ర కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. కార్యకర్త కుటుంబాలకు BJP ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. BJP ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.