W.G: డ్రైవర్లను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.వి.ప్రతాప్ డిమాండ్ చేశారు. గురువారం తణుకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం వినతిపత్రం అందజేశారు. డ్రైవర్లు అందరికీ ఏడాదికి రూ. 30వేలు ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.