MBNR: దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లి గ్రామం నుంచి అజిలాపూర్ వరకు వెళ్లే రహదారి అధ్వానంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ, పనులు సక్రమంగా పూర్తి కాకపోవడంతో రహదారి దెబ్బతిని గుంతలమయమైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు ఈ సమస్య పెద్ద సవాల్‌గా మారింది.