GDWL: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2025- 26 విద్యా సంవత్సరానికి గద్వాల జిల్లాలో ఉన్న బాలబాలికల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు TGSWRS జిల్లా సమన్వయ అధికారి రామాంజనేయులు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ దరఖాస్తులను ఈ నెల 18వ తేది లోపు సమర్పించాలన్నారు.