AKP: ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచించారు. బుధవారం రాంబిల్లి మండలం దిమిలిలో పర్యటించి పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.పారిశుధ్యం మెరుగుకు అధికారులు కృషి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు.