ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం పంపనూరు గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిపై ఆలయ ఈఓ, పూజారులు, దేవాదాయశాఖ డిఈ శ్రీనివాసులతో సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, సౌకర్యాల విస్తరణ, భక్తులకు మెరుగైన వసతులపై చర్చించారు. దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రమై అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు.