NZB: జిల్లాలోని ఆర్వోబీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే వారంలో నిరాహార దీక్ష చేపడుతానని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అడవి మామిడిపల్లి ఆర్వోబీకి రూ.22 కోట్లు అవసరమైతే, కొన్ని ఏళ్ల క్రితమే సుమారు రూ.18 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపారు.