KMM: కామ్రేడ్ వేముల సుబ్బయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి అన్నారు. బుధవారం చింతకాని (M) కోమట్లగూడెంలో కామ్రేడ్ సుబ్బయ్య 12వ వర్ధంతి సభ నిర్వహించారు. ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి ప్రభుత్వం తరఫున వచ్చే పథకాలను అర్హులకు అందించారని చెప్పారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పేర్కొన్నారు.