VZM: కొత్తపేట కుమ్మరి వీధికి చెందిన టీడీపీ పార్టీ కార్యకర్త అల్లాడ ఆనంద్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అదితి గజపతి రాజు బుధవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన ప్రమాద భీమా రూ. 5,00,000 చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.