హెల్తీ, వెల్తీ, హ్యాపీ AP సాధనే లక్ష్యంగా అంతా పనిచేయాలని CM చంద్రబాబు కూటమి నేతలకు సూచించారు. రాయలసీమకు పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నామని.. తిరుపతి, శ్రీశైలం, గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. PM మోదీ రేపు రూ.13000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారని, ఆయన రాకతో శ్రీశైలం క్షేత్రానికి మహర్దశ రాబోతుందని పేర్కొన్నారు.