SKLM: జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనాల చోరీ కేసును చేదించామని డీఎస్పీ వివేకానంద తెలిపారు. బుధవారం శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఏడు బుల్లెట్లను స్వాధీనం చేసుకొని దండు రిషి వర్ధన్, రాయపల్లి వినోద్, చిట్టి సంతోష్లను అరెస్టు చేశామని తెలిపారు. ఈ వాహనాల విలువ సుమారు రూ. కోటి 40 లక్షలు ఉంటుందన్నారు.