TG: నిత్యం ఏదొక వివాదానికి కేంద్రంగా నిలుస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై మరో కేసు నమోదైంది. ఫేక్ బర్త్ సర్టిఫికేట్లతో 52 మందిని క్రికెట్ ఆడించారనే ఆరోపణలతో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ హబీబ్ అహ్మద్ సహా పలువురిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడించడం కోసం ఇద్దరు ప్లేయర్స్ నుంచి డబ్బులు కూడా వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.