KMR: జిల్లాలోని 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయాధికారి నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు హాజరైన, ఇంతవరకు సీటు పొందని విద్యార్థులు అర్హులన్నారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4.30 వరకు దరఖాస్తులను అందజేయాలన్నారు.