కృష్ణా: జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో నూతనంగా నిర్మించిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) యూనిట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. కర్నూలులో జరిగిన సభలో పాల్గొన్న మోదీ వర్చువల్‌గా బెల్ కంపెనీని ప్రారంభించారు. రూ. 362 కోట్లతో నిర్మించిన ఈ యూనిట్‌కు 2016లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.