GNTR: మాజీ రాష్ట్రపతి, భారత రత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి గుంటూరు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా , వివిధ శాఖల అధికారులు కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మిసైల్ మ్యాన్‌గా దేశ గౌరవం పెంచిన కలాం యువతకు శాశ్వత స్ఫూర్తి అన్నారు.