WNP: రాబోయే పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నూటికి, నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హరిజనవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మంచి మార్కులు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.