E.G: దీపావళి పండుగను పురస్కరించుకుని కొవ్వూరులో ఏర్పాటు చేసిన తాత్కాలిక పటాకుల లైసెన్స్ షాపులను, అక్కడ భద్రతా ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.మార్టిన్ లూథర్ కింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా షాపుల నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. అగ్నిప్రమాదాలను నివారించడానికి షాపుల్లో తగినంత సౌకర్యాలు ఉండాలన్నారు.