HYD: ఖైరతాబాద్‌లో రేపు సదర్ సందడి ఉంటుంది. సా. 7 గంటలకు ఖైరతాబాద్ లైబ్రరీ వద్ద ఈ వేడుక నిర్వహిస్తారు. దీపావళి పండుగ మరుసటి రోజున ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ అని 8 దశాబ్దాలుగా సదర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళారపు చౌదరి యాదయ్య యాదవ్ సోమవారం తెలిపారు. స్థానికులు వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.