HNK: కాకతీయ విశ్వవిద్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు నాగరాజు మాట్లాడుతూ.. బీసీ 42% రిజర్వేషన్ అమలు నిలిపివేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రవర్ణాల కుట్రను తిప్పికొట్టేందుకు ఈ నెల 18న తెలంగాణ బంద్ విజయవంతం చేయాలని విద్యార్థులు, ప్రజలు పిలుపునిచ్చారు.