AP: మోదీ పర్యటన వేళ తమకు న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు కర్నూలులో ఆందోళన చేపట్టారు. కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ప్రధాని మోదీకి తమకు జరిగిన అన్యాయం, తమ బాధను వివరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిమాండ్ చేశారు.