TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఆమెతో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్, పద్మారావు గౌడ్, బీఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కార్యాలయానికి వెళ్లారు.