NZB: వేల్పూర్ మండలంలోని జానకంపేట గ్రామంలో బుధవారం పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ఉచితంగా నిర్వహించారు. మండలంలోని పాడి రైతులు తమ పశువులకు ఈ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.