ATP: జిల్లాలో జాతీయ ఉద్యాన బోర్డు ద్వారా రూ.260 కోట్లతో రెండు అరటి క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విద్యాశంకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 20,811 మంది రైతులకు చెందిన 4,314 హెక్టార్లలో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు తెలిపారు. అరటి ఎగుమతుల ద్వారా సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యమన్నారు.