అన్నమయ్య: గత నాలుగు రోజుల క్రితం గాలివీడు నుంచి 108 అంబులెన్స్‌లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడిన ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. చికిత్స సమయంలో తన పేరు శ్రీను (60), తండ్రి పేరు చంద్రయ్య, స్వస్థలం రామచంద్రపురం, తిరుపతి అని తెలిపినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై రాయచోటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.