BPT: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే వైద్యం వ్యాపారమవుతుందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణయ్య అన్నారు. నిలిచిపోయిన బాపట్ల మెడికల్ కళాశాలను గురువారం ఆయన పరిశీలించారు. పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే, పేదలకు వైద్యం అందదని రమణయ్య హెచ్చరించారు. రిజర్వేషన్లు దక్కక, పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారన్నారు.