KRNL: ప్రధాని నరేంద్ర మోదీ రేపు కర్నూలు పర్యటన నేపథ్యంలో బుధవారం పెద్దకడబూరు గ్రామ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వామపక్షాల ఆధ్వర్యంలో ‘మోదీ గో బ్యాక్’ అంటూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు తిక్కన్న, వీరేశ్ మాట్లాడుతూ.. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వని మోదీకి ఏపీలో అడుగు పెట్టే అర్హత లేదన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి రావాలన్నారు.