ASR: చింతపల్లి మండలం లోతుగెడ్డ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో భోజనశాల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల భోజన సౌకర్యం కోసం అధికారులు గతంలో భోజనశాల నిర్మాణం ప్రారంభించారన్నారు. అయితే ఇప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. పాఠశాలలో 430మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. భోజనశాల నిర్మించాలని కోరారు.