సత్యసాయి: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం ఆర్డీవో వి.వి.ఎస్. శర్మ, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.