NZB: బోధన్ మండలం నాగన్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. జిల్లా, మండల న్యాయ సేవ అధికార సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తులు ఉదయ్ భాస్కర్, శ్రీనివాస్, సాయి శివ ప్రజలకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో న్యాయవాదులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.