SS: లేపాక్షి మండలం కొండూరులో హిందూపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ దీపిక బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆమెకు స్వాగతం పలికారు. దీపిక మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించి గ్రామ కమిటీలలో భాగంగా, అందరికీ కమిటీలో చోటు కల్పిస్తామని తెలిపారు. 2029లో జగన్ను సీఎం చేసుకుందామని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.