గుంటూరు సంగడిగుంటకు చెందిన మేజర్ భరద్వాజ్ రాజస్థాన్లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ దురదృష్టవశాత్తు మరణించారు. వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ భరద్వాజ్ గుంటూరుకి గర్వకారణం అన్నారు. భరద్వాజ్ చేసిన త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారు.