NLG: మర్రిగూడ మండలంలోని అన్ని జీపీల్లో నేటి నుంచి వచ్చే నెల14 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు డా.సురేందర్ తెలిపారు. పశు వైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో డా.యమున, డా. పసియుద్దీన్ నేతృత్వంలో 2 బృందాలుగా టీకాలు వేస్తాయని చెప్పారు. ఈ శిబిరాల కారణంగా పశువైద్యశాల సేవలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు.