AP: ప్రధాని మోదీ రేపు రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు శ్రీశైలం రహదారులపై రాాకపోకలపై ఆంక్షలు పెట్టారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలానికి రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్-శ్రీశైలం, దోర్నాల-శ్రీశైలం రహదారి మార్గాల్లో వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.