ATP: నార్పల మండలం గూగూడు గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు చమలూరు రాజగోపాల్, నార్పల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.