MNCL: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకంటున్నామని TGMDC మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల ప్రాజెక్టు అధికారి రామకృష్ణ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇసుక మాఫియా కొనసాగుతుందని, సామాజిక మాధ్యమాలలో వస్తున్న అవాస్తవ కథనాలలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు.