మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర CM ఫడ్నవీస్ కాసేపట్లో ప్రెస్మీట్ ద్వారా అధికారికంగా ప్రకటించనున్నారు. మల్లోజులతో పాటు 61 మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలేశారు. నక్సలైట్ ఉద్యమంలో ఆయనది 40 ఏళ్ల ప్రస్థానం కాగా.. ఆయన భార్య తారక్క ఈ ఏడాది జనవరిలో లొంగిపోయారు.