అన్నమయ్య: చిన్నమండెం మండలం వండాడి తూర్పుపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్వ కిరణ్ (17), రెడ్డి మహేష్ (17) అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఫోర్‌వీలర్ ఆటో స్కూటర్‌ను ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బంధువులు వెంటనే వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం వైద్యులు తిరుపతిలోని రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు.