బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఈ ఎన్నికల్లో తాను బరిలోకి దిగడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, తాను ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, తన పార్టీ కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తానని వెల్లడించారు.