HNK: జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ఇంఛార్జ్ RJDగా నియమితులైన గోపాల్ను బుధవారం శాయంపేట మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం కలిసి సన్మానించారు. కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, హాజరు శాతాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని అధ్యాపకులకు RJD గోపాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.