BDK: బంద్ ఫర్ జస్టిస్ పేరుతో ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం బీసీ రిజర్వేషన్ల సాధనకు అశ్వాపురం మండలం బీసీ సంఘాలతో బీసీ జేఏసీ ఏర్పాటు చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఒక సామాజిక ఉద్యమంగా సాగాలని సూచించారు.