SRCL: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గూడెం కొత్తవీధి నుంచి గొందిపల్లి వెళ్లే రహదారి మధ్యలో డీ.కొత్తూరు సమీపంలో రోడ్డు బాగా కోతకు గురైంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జీకేవీధి పంచాయతీ ఉప సర్పంచ్ కొర్రా రాంబాబు, స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బుధవారం రహదారికి రాళ్లు, సిమెంటు వేసి మరమ్మతులు చేపట్టారు.