కిరణ్ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన చిత్రం ‘కె- ర్యాంప్’. యుక్తీ తరేజా హీరోయిన్. ఈ సినిమా శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన ప్రెస్మీట్లో కిరణ్ మాట్లాడుతూ.. ‘కె- ర్యాంప్’ మూవీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుందని తెలిపాడు. అది తన గ్యారెంటీ అని చెప్పాడు. ఎక్కడా ఇబ్బంది పడరని చెప్పుకొచ్చాడు.