KNRL: కోసిగి మండలం అగసనూరు సమీపంలోని తిప్పన్న తాత మఠం వద్ద ఆదివారం గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు అత్యాధునిక మెటల్ డిటెక్టర్లతో ఈ ప్రయత్నం చేశారు. స్థానికులు వారిని గమనించి ఫొటోలు తీయడంతో, వారు వెంటనే పరికరాలతో సహా కారులో పరారయ్యారు. ఈ సమాచారం అందుకున్న SI రమేశ్ రెడ్డి విచారణ చేపట్టారు.