MDK: సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే వీడియోలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని రేగోడ్ SI పోచయ్య తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా సాగేందుకు ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఓటు కొనుగోలు, అమ్మకాలు, బెదిరింపులు, రాజకీయ ఒత్తిడులు వంటి అక్రమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.